15 August, 2021 < Back
హోషి ర్యేకాన్ - ప్రపంచంలో నడపబడే ఒకానొక అతి ప్రాచీన హోటలు
హోషి ర్యేకాన్ - (ఒక సాంప్రదాయ బాటసారుల వసతి గృహం).1300 సంవత్సరాల చరిత్ర కలది. 718వ సంవత్సరంలో ప్రారంభింపబడిన ఈ వసతి గృహం హోషి కుటుంబ యాజమాన్యంలో 46 తరాలుగా నిర్వహింపబడుతోంది. 1904 లో గిన్నెస్ ప్రపంచ రికార్డుకెక్కి ప్రపంచంలొ అతి పురాతన హోటలుగ గుర్తిపు పొందింది.
చారిత్రిక కధనం ప్రకారం టైచో డైశీ అనే బౌద్ధామతాచార్యుడు (సాధువు) ఆ ప్రాంతంలొ సంచరిస్తూ ఒక కలగన్నాడు. అతని కలలో ఒక దివ్యపురుషుడు కనిపించి దగ్గరలొ ఒక వేడి నీటి ఊట ఉన్నదని, ఆ నీటిలో స్నానం చేసిన వారికి ఆధ్యాత్మిక పరిశుద్ధి కలుగుతుందని చెప్పాడని ప్రతీతి. అప్పుడు ఆ సాధువు -టైచో ఊట ఉన్న చోటు వెతికి కనుగొన్నాడు. అది భూగర్భంలో లోతుగా ఉండటంవల్ల చుట్టుపక్కల గ్రామస్తులచేత తవ్వించి పైకి తెప్పించాడు. టైచో తన శిష్యులలో ఒకరిని (హోషోని ) ఒక సత్రం లాంటిది (జపనీస్ భాషలో ర్యేకాన్ ) నిర్మించమన్నాడు.
హోషి మొదట్లో ఆరోగ్య నయం కొరకు ఒక బస కట్టాడు . ఆ తర్వాత మొదటి తరం జెంగరో (అంటే జపనీస్ భాషలో యజమాని) అన్ని సౌకర్యాలతో కూడిన వసతి గృహంగా రూపొందించాడు. దీనివల్ల అతిధులు ఉష్ణకుండం లో స్నానం చేసి శారీరిక, మానసిక ఊరడి పొండటానికి వీలు కలిగింది. ఆ విధంగా హోషి కుటుంబం నిబద్ధత తో చేసిన సౌకర్యాలను వినియోగించుకొని జపాను దేశ అచార ప్రకారం జల గ్రహణం అంటె స్నానం చేసి ఆ ఉష్ణకుండం లో గల ఔషధ- నివారణా గుణాల లాభం పొందుతున్నారు.
హోషి తరతరాలుగా ఆదరింపబడుతోంది. అత్యంత పవిత్ర సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆవిధం గా హోషి కుటుంబం చారిత్రికత శతాబ్దాలుగా గర్వించతగ్గ విధంగా నిర్వహింపబడుతోంది. ఈ విషయంలో గిన్నెస్ బుక్ అఫ్ వరల్ద్ రికార్దు వారు ప్రత్యక్ష తనిఖీ చేసి ధృవీకరించారు.
హోషి కుటుంబ వ్యాపార దీర్ఘ కాల మనుగడకి, ఆ కుటుంబం యొక్క అత్యంత అంకిత భావం, భవిష్య దార్శనికత కారణం. సామాజిక సేవలో ఉన్నత ప్రమాణాలు పాటించటం వల్ల ప్రజాభిమన్నాని పొంది, కలాతీత సంస్థగా ఉదాహరింపబడుతోంది.
ప్రస్తుత జింగరో హజమీహోషి 46వ తరం. అతని దినచర్య ఉదయం 6.45 కి మొదలవుతుంది. హోషి దంపతులు హొటలు సిబ్బందికి, అతిధులకి హొటలు చరిత్ర సంప్రదాయములు సంస్కృతులని గురించి చెబుతారు.వాళ్ళిద్దరు హొటలు దైనందిన కార్యనిర్వహణలో నిమగ్నులై ఉంటారు. అతిధులకి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తారు. రోజు ఎదొ ఒక అంశం మెరుగు పరుస్తూ ఉంటారు. ఈ విధంగా చిన్న చిన్న అభివృద్ధులు చేస్తు హొటలు కీర్తిని ఇనుమడింప చేస్తూ ఉంటారు.
వారసత్వ విధానంలో స్పష్టత, తరతరాలుగా అనుసరిసరిస్తున్న పద్ధతులు ఆ కుటుంబ వ్యాపార సఫలతకి సోపానాలు. ఆ కుటుంబంలో ఒక వ్యాపార సూత్రం ఉంది. “సన్నగా ఉన్న్న నీటి ప్రవాహాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి “అని. ఇందులో మర్మమేమంటే ఒక సన్నని వాగులా మొదలైన ప్రవాహం ఏవిధంగా అడ్డువచ్చిన నిరోధాలని పక్కకు నెట్టి ముందుకు సాగిపోతుందో అల్లాగ వ్యాపారాన్ని నడిపించాలి అని.
వర్తమానం మీద కెంద్రీకరిస్తూ, ఆతిధ్య సేవలు నిరంతరాభివృద్ధి చేస్తూ గతుకులు లేని బండిలా ర్యేకాన్ సాఫీగా సాగిపోతోంది.
కుటుంబానికి, వ్యాపారానికి రాజీ పడని కఠిన విలువలు నెలకొల్పుకొని, అనుసరించటంవల్ల ర్యేకాన్ సుదీర్హకాలం కొనసాగుతోంది. అయితే ప్రతీతరం యాజమాన్యం సమకాలీన మార్కెట్ పరిస్తితులకి అనుగుణంగా విధానాలని దిద్దుకొనేందుకు అవకాశం కల్పింప బడింది.
హోషీ పేరు, వారసత్వ విధానము.
కుటుంబం పేరు, యాజమాన్య వాటా కుటుంబ వ్యాపారంలో పనిచేసే సభ్యులకే సంక్రమిస్తుంది. అస్పష్టత, కలహాలు నివారణకి కుటుంబంలో అగ్రజన్ముడైన (జ్యేష్ఠ పుత్రునికి) సంక్రమింపచేస్తారు. ఈ విధంగా అధికార/యాజమాన్య సంక్రమణం జరగక చాలా ముందుగానే ఉత్తరాధికారి ఎవరొ కుటుంబసభ్యులకి తెలుస్తుంది.ఒక వేళ మగసంతానం (జ్యేష్ఠ పుత్రుడు) లేకపొతే అల్లుణ్ణి దత్తత చేసుకుంటారు. అతని ఇంటిపేరు హోషిగా కొనసాగుతుంది. ఆవిధంగా ప్రజ్ఞావంతులైన వ్యక్తుల్ని పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ ద్వారా సమకూర్చుకోవచ్చు.
ప్రతీ వారసత్వ బదిలీ ముందు ఆస్తుల విలువ మదింపు చేయ బడుతుంది. ప్రతీ తరంలోను నవ్య భావనలు ప్రవేశ పెట్టే అవకాశం ఉండడంవల్ల వ్యాపార మనుగడకి సంకటం కలిగించే పరిస్తితుల నించి రక్షింపబడి వారస్త్వం నిరంతరం విజయవంతంగా కొనసాగుతోంది.
ప్రస్తుత జెంగరో జ్యేష్ఠ పుత్రుడు 2013 లో చనిపోయాడు. అతని చెల్లలు హైసీ యూనివర్సిటీ పట్టభధ్రురాలు, బయట కంపెనీలో పనిచేస్తోంది. ఇప్పుడు కుటుంబవ్యాపారంలో ముఖ్యమైన బాధ్యతలు చేపట్టింది.ఆమెకి ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళయితే ఆమె భర్త 47వ జింగరో అవుతాడు. కాని హోషి కుటుంబం సంప్రదాయం మార్చి, హైసీనే కొనసాగాలని కోరుకుంటున్నారు. అల్లా అయితే 1300 సంవత్సారాల చరిత్రలొ హైసీ ఒక మహిళా 47వ జింగరో అవుతుంది.
విషయ సేకరణ మూలాలు-
- Official Website of Hoshi Ryokan (www.ho-shi.co.jp/en)
- Enduring Firms Transfer Assets and Knowledge Effectively, Morten Bennedsen, INSEAD Professor of Economics and Political Science, 2016
- How to create a family business that lasts a thousand years, EJ Insight, 2015
- Documentary Film on Hoshi Ryokan (vimeo.com/114879061)
అధికారిక హోషీ రోకన్ అంతర్జల స్థలం

S.V.M. Sastry
About the Writer
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.
Downloads

Get your Monthly Subscriptions
Become a Member
Member will have exclusive access to
articles / videos / expert columns
This exclusive service is free of cost
for a limited period of time and
soon will become a paid service.