Insights

30 September, 2022 < Back

సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనడం అనేది నాయకులు, వ్యవస్థాపక కుటుంబాల సభ్యుల వ్యక్తిగత బ్రాండ్ ను రూపొందించుకొనడానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. చాలా మంది వ్యవస్థాపకులు, స్టార్ట్-అప్ వ్యవస్థాపకులు, సి-సూట్ నాయకులు శక్తివంతమైన వ్యక్తిగత బ్రాండ్‌ను రూపొందించడానికి విజయవంతమైన సోషల్ మీడియా వ్యూహాలను అనుసరించారు. ఆ వ్యక్తి ఏ సంస్థతో అనుబంధం కలిగి ఉంటాడో ఆ బ్రాండ్ గుర్తింపును మెరుగుపరచడానికి ఇది సమర్థవంతమైన వ్యూహం.

కుటుంబ యాజమాన్యం లోని వ్యాపారం విషయంలో వ్యవస్థాపకుడు లేదా కుటుంబ సభ్యులు లేదా సంస్థ వ్యక్తిగత బ్రాండ్‌ల మధ్య పరస్పర లింక్‌ల వలన ఆన్‌లైన్ కీర్తి సామాన్యంగా కొంత ఎక్కువ క్లిష్టంగా ఉంటుంది. అందువల్ల, వ్యక్తిగత లేదా సంస్థ బ్రాండ్ గుర్తింపును బలోపేతం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని వ్యక్తి / కుటుంబం గట్టిగా విశ్వసిస్తే ఆ వ్యక్తిగత కీర్తి నిర్వహణ కోసం బాగా ఆలోచించిన సోషల్ మీడియా వ్యూహాన్ని అనుసరించి కోర్/ వారసత్వ వ్యాపారం ల బ్రాండ్ గుర్తింపును మెరుగుపరచడానికి దానిని అర్థవంతంగా ఉపయోగించడం ముఖ్యం.


కుటుంబ వ్యాపార వ్యాపారవేత్తలు / నాయకులు సోషల్ మీడియాను స్వీకరించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు:


  • ఇది ఒకరి వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్మించడానికి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్కెటింగ్ సాధనం/ ప్లాట్‌ఫారమ్‌ ను అందిస్తుంది. దాని వలన ఇది వారి కంపెనీ లోపల, వెలుపల ఉన్న వారితో కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
  • ఇది తోటివారు, ఉద్యోగులు, కస్టమర్‌లు, ఎక్కువ మంది ప్రజలతో, ముఖ్యంగా యువ తరాలతో వేగంగా,ఏకకాలంలో సంభాషించడానికి, వారి జీవితాల్లో ప్రతి ఒక్కరి నుండి వారు ఆశించే అదే పారదర్శకంగా ప్రత్యక్ష మార్గంలో నిమగ్నమవ్వడానికి వీలు కల్పిస్తుంది.
  • ఇది తక్షణ సమాచారం, ప్రత్యక్ష అభిప్రాయం ల నుండి నేర్చుకోవడానికి అవకాశాన్ని అందిస్తుంది.
  • ఒరాకిల్ సి.ఎఫ్.ఒ. గా లింక్డన్‌లో ఒక రిక్రూటర్ జెఫ్ ఎప్‌స్టీన్ ను కనుగొన్న తర్వాత అతను నియమించబడ్డాడు. ఐరిష్ సాఫ్ట్‌వేర్ కంపెనీ గోషిడో వ్యవస్థాపకుడు గెర్ హార్ట్‌నెట్,అతని బృందం నెట్‌వర్క్‌ను ఉపయోగించి పెట్టుబడి పెట్టగల పెట్టుబడిదారులకు 700 సందేశాలను పంపి ఎనిమిది రోజుల్లో 230,000 అమెరికన్ డాలర్ల పెట్టుబడి సేకరించారు.


    విపత్తులను నిర్వహించడం


    సోషల్ మీడియా ప్రయోజనాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కుటుంబాలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ కీర్తికి వచ్చే విపత్తులను పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర ఆస్తులను ఎలా రక్షించుకుంటామో అలా కుటుంబ ప్రతిష్టను కాపాడుకోవడం/రక్షించడం కూడా అంత అవసరం.

    ప్రస్తుత కాలంలో సమాచారం ప్రయాణించే వేగం, పబ్లిక్ డొమైన్‌లో పోస్ట్ చేయబడిన ప్రతికూల సమాచారం ఎప్పటికీ అందుబాటులో ఉండే వాస్తవం కారణంగా ప్రస్తుత కాలంలో ఇది చాలా సవాలుగా ఉంది. అంతేకాకుండా, సోషల్ మీడియా సైట్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం పూర్తిగా అందుతుంది కాబట్టి వ్యాపార కుటుంబాలు తరచుగా సైబర్ క్రైమ్ లాంటి ఇతర ప్రమాదాలకు గురి అవుతున్నాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి.


    మార్గదర్శక సూత్రాలను రూపొందించడం


    మామూలుగా "జాగ్రత్తగా ఉండండి" అని కుటుంబ సభ్యులను అడగడం వల్ల ఫలితం ఉండదు. సోషల్ మీడియాలో క్రమశిక్షణ లేదా జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల వచ్చే చిక్కులు కుటుంబంగా అధికారిక సమావేశాలలో చర్చించబడాలి. కుటుంబ డిజిటల్,భౌతిక భద్రతను రక్షించే సోషల్ మీడియా విధానాన్ని రూపొందించడం అన్ని ఉన్నత స్థాయి సంపన్న కుటుంబాలకు అవసరం.

    ఉదాహరణకు ఒక కుటుంబంలో వారి “పేరు, ప్రతిష్ఠల నిర్వహణ విధానం” ప్రతి కుటుంబ సమావేశంలో సోషల్ మీడియా వినియోగం, కుటుంబ పేరు, ప్రతిష్ఠలకు వచ్చే ప్రమాదాన్ని చర్చించడానికి కట్టుబడి ఉంటుంది. సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంలో సహాయపడటానికి వారు బయట నుండి ఫెసిలిటేటర్‌ను ఉపయోగించడంతో పాటు హ్యాకర్ల నుండి రక్షింపబడడానికి సైబర్‌ సెక్యూరిటీ ఆడిట్‌ను కూడా ఏర్పరచుకుంటారు.

    కుటుంబం తన సోషల్ మీడియా విధానాన్ని రూపొందించబోయే ముందు సభ్యులు తమ సోషల్ మీడియా ఖాతాలతో ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో అడిగి దానిని అర్ధం చేసుకొని రూపొందించవచ్చు.

  • సోషల్ మీడియా విధానం లక్ష్యం కేవలం ఇబ్బంది, దొంగతనం, మోసం, ఆర్థిక హాని నుండి కుటుంబాన్ని రక్షించడమేనా?
  • లేదా కుటుంబ సానుకూల ఇమేజ్‌ని మెరుగుపరచడం, కుటుంబ వారసత్వాన్ని మరింత స్పష్టంగా తెలియజేయడం అనే లక్ష్యాలు కూడా ఉన్నాయా?
  • కుటుంబం వ్యాపార సోషల్ మీడియా, కుటుంబ సోషల్ మీడియా ల మధ్య తేడాను గుర్తించడంతో పాటు అవి ఒక దాని ప్రభావం మరొక దానిపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
  • కుటుంబ వ్యక్తిగత సోషల్ మీడియా వ్యాపార బ్రాండ్‌ను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందా లేదా వ్యాపారాన్ని పూర్తిగా ప్రస్తావించకుండా ఉండగలదా?
  • లేదా కుటుంబ దాతృత్వ కార్యకలాపాలపై సోషల్ మీడియా కార్యకలాపాల ప్రభావం ఉంటుందా?
  • ఒక వ్యక్తిగా లేదా ఒక కుటుంబంగా ఏ సమాచారాన్ని బహిర్గతం చేయాలి ఏది బహిర్గతం చేయకూడదు అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. వారు గోప్యంగా ఉంచాలనుకునే ఏ విషయమైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయకూడదు.

    పాలసీ - ముసాయిదా తయారు చేసుకునే ప్రక్రియలో సామూహిక చర్చ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అవసరాలు, లక్ష్యాల చిక్కులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అటువంటి చర్చ అవగాహనను పెంచడంతో పాటు కుటుంబ ముఖ్య నిబద్ధతను భద్రపరుస్తుంది.

    sastry

    S.V.M. Sastry

    About the Writer

    Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.

    Share on

    Get your Monthly Subscriptions

    You may be interested in

    PFBI Connect

    Monthly E-zine offerings

    Know More

    Video Gallery

    Characteristics of Generative Families- Dennis Jaffe

    Know More

    Family Business Videos

    Explore The Breakout Sessions

    Know More

    Case Study

    Offering in-depth study into the business-related.

    Know More

    Become a Member

    Member will have exclusive access to
    articles / videos / expert columns

    This exclusive service is free of cost
    for a limited period of time and
    soon will become a paid service.