MAY, 2023 < Back
ప్ర.1 సంపన్న కుటుంబాలకు ఫామిలీ ఆఫీసు అవసరం ఏమిటి ?
సంపన్న కుటుంబాలకి ఆర్ధిక పరమైన సమస్యలు క్లిష్టం గా ఉంటా యి. అందుకని వాళ్ళకి ప్రత్యేక నైపుణ్యంగల వారి సేవలు కావాలి. వాళ్ళు అటువంటి వ్యక్తిగతమైన సమగ్రమైన ఆర్ధిక పరిష్కారాలు వాళ్ళ వాళ్ళ సమస్యలకి సరిపోయేటట్లు ఇవ్వ్వగలరు.అల్ల్లాంటి సేవల వల్ల కుటుంబాలు తమ సంపదని తర తరాలుగా నిర్వహించుకొని స్థిరత్వాన్ని భవిష్యత్తులో కొనసాగించగలుగుతారు.
ప్ర.2 సాంప్రదాయ సంపద నిర్వహణకి ఇప్పటి ఫామిలీ ఆఫీసుకి తేడాఏమిటి?
ఏన్నొవిధాలుగా తేడాలున్నాయి
ప్ర. 3 ఫామిలీ ఆఫీసులు ఎన్నిరకాలుగా ఉంటాయి ?
1. సింగిల్ ఫామిలీ అఫీ ఇది ఒకే కుటుంబానికి అంకితమై సేవలనందిస్తుంది
పిట్త్జికర్ కుటుంబం తమ విజయవంతమైన పెట్టుబడులకి చాలా ప్రసిద్ధి. వాళ్ళు ఆతిధ్య, తయారీ, రియల్ ఎస్టేటు రంగాలలో సింగిల్ ఫామిలీ ఆఫీసు తో నిర్వహించారు. బహుళ కుటుంబ కచేరి- ఇది వివిధ సంపన్న కుటుంబాలకి సేవలనందిస్తుంది. డుపాంట్ కుటుంబం 1903 లో స్థాపించింది.ఈ అఫీసు సంపద,పెట్టుబడుల గురించి విస్తృతమైన సలహాలిస్తుంది.
2. వర్చువల్ ఫామిలీ అఫీసు- ఇది తన సేవలను సంకేతికత సహాయముతో దూరం నుండే అందిస్తుంది.
జాన్సన్ కుటుంబం మందుల తయారీలో పెద్దకంపెనీ.వీళ్ళు పిక్టేరియన్ అనే సంస్థ ద్వారా వర్చువల్ ఫామిలీ ఆఫీసు సేవలు ఉపయోగించుకుంటున్నారు.
3. మల్టీ కుటుంబ ఆఫీసు-ఇది అనేక కుటుంబాలకి ఆర్ధిక సేవలు అందిస్తుంది.
డూపాంట్ కుటుంబం ఈ తరాహా ఫామిలీ ఆఫీసు ఎంచుకొంది. లివింగ్టన్ ట్రస్టుని 1903 లో స్థాపించి సంపద, పెట్టుబడుల నిర్వహణ కోసం ఇతర కుటుంబాలతో బాటు సలహాలు పొందుతోంది.
4. మిశ్రమ ఫామిలీ ఆఫీసు- ఇది సింగిలు+ మల్టి ఫామిలీ ఆఫీసు లక్షణాలు కలిగి ఉంటుంది.
రాథ్చైల్డ్ కుటుంబం (ఎడ్మండ్ డి రాథ్ చైల్డ్ గ్రూప్) ఈ తర్హా ఫామిలీ ఆఫీస్ కలిగి ఉంది.
ప్ర.4 ఎస్టేట్, పన్నుల ప్లానింగ్ లో ఫామిలీ ఆఫీసు ఎల్లా ఉపయోగపడుతుంది?
ఎస్టేట్ ప్లానింగ్- కుటుంబ వ్యాపార కార్యాలయం ఎస్టేట్ ప్లానింగులో కీలక పాత్ర వహిస్తింది. అది వ్యుహాలను, పన్ను తగ్గించే సహాలను అందిస్తుంది.తరువాతి తరం వారికి సంపద, వ్యాపారం సాఫీగా బదిలీ చెయ్యటానికి సహాయ పడుతుండి.
ఒక ఉదాహరణ: కార్గిల్ కుటుంబం ఫామిలీ ఆఫీసు 1997 లొ సంపద, వ్యాపార నిర్వహణకై నెలకొల్ప బడింది. ఇది యు.ఎస్ లొ ప్రైవేట్ రంగంలో ఉన్నా అతిపెద్ద ఫామిలీ ఆఫీసు. ఒకటి మరియు 150 సంవత్సరాలుగా కుటుంబ యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడుతోంది ఇది కార్గిల్ దాతృత్వం అని పిలవబడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ లో కీలక పాత్ర వహిస్తోంది. దీనికి న్యాయ.ఆర్ధిక నిపుణులు సలహాదార్లుగా ఉంటారు.ఎస్టేట్, ఆస్తులు, పన్నుల ఆదా సమర్ధవంతంగా నిర్వహింపబడుతున్నాయి. పన్ను ప్రణాలిక ఫామిలీ ఆఫీసు పన్నుల ప్రణాలిక కోసం సలహాలు/మార్గదర్శనం ఇస్తుంది. దానివల్ల పన్నులు కనీస స్థాయికి తగ్గించవచ్చు.సంపద రక్షణ పన్ను సమర్ధ పద్ధతులు, పెట్టుబడుల నిర్వహణ చేకూరుతాయి. పన్నులు చెల్లించటము, రిటుర్నులు తయారు చెయ్యటం లోను ఈ ఆఫీసు సహకరిస్తుంది.
మార్స్ కుటుంబం --మార్స్ ఇంకార్పొరేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ MIFS' అనే పేరుతో ఫామిలీ ఆఫీసు స్థాపించింది. ఇది పన్ను ప్రణాలిక , అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ, ద్వారా పన్నులు కనీస స్థాయికి తగ్గించ గలిగింది. బదిలీ ధర పద్ధతి వల్ల సబ్సిడీరిల మధ్య లావా దేవీలలొ పన్ను ఆదా అవుతోంది. మార్స్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు విద్యా, వాతావరణం, ప్రజా అరోగ్యం రంగాలలో నిర్వహిస్తోంది.
ప్ర.5 పెట్టుబడుల నిర్వహణలో ఫామిలీ ఆఫీసు ఏ విధంగా సహాయ పడుతుంది?
కుటుంబ ధ్యేయాలకి అనుగుణంగా పెట్టుబడుల వ్యూహం//నిర్వహణ చేస్తుంది. కుటుంబానికి ప్రత్యేకమైన పెట్టుబడుల ప్రణాలికల తయారు, పెట్టుబడి రంగాల ఎంపిక, అజమాయిషి,పనితీరు సమీక్ష, దిద్దుబాటు చర్యలు వీటికి సంబంధిచిన అమూల్యమైన సలహాలు ఫామిలీ ఆఫీసు ఇస్తుంది. ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు కూడా సూచిస్తింది. ప్రవేశానికి దారి కూడా చూపిస్తుంది .
ప్రిట్జికర్ కుటుంబంఈ కుటుంబం 1950 లో వాళ్ళ సంపద, పెట్టుబడుల నిర్వహణ కోసం ఒక ఫామిలీ ఆఫీసు స్థాపించింది.ఇది ఒక ప్రైవేట్ ఈక్విటీ కంపెనీగా విస్తరించింది. వెంచర్ కేపిటల్ లాంటి ప్రత్యామ్నాయ రంగాలలో పెట్టుబదులు పెట్టి గ్రూపు వ్యాపారం అభివృద్ధి చేసింది. వాళ్ళు పౌర సంబంధాలు, ప్రత్యేక నైపుణ్యాలు ఉపయోగించుకొని కొత్త వ్యాపారాలు స్థాపించే వాళ్ళని గుర్తించి గ్రూపు వ్యాపారాభి వృద్ధికి ఫామిలీ ఆఫీసు తోడ్పడుతుంది. ఉదాహరణకు, ప్రిట్జ్కర్ గ్రూప్ స్టార్టప్ అప్టేక్లో పెట్టుబడి పెట్టింది, ఇది ఇండస్ట్రియల్ డేటా అనలిటిక్స్ మరియు ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సొల్యూషన్లను అందిస్తుంది మరియు కంపెనీ చిన్న స్టార్ట్-అప్ నుండి బిలియన్-డాలర్ వాల్యుయేషన్కు ఎదగడానికి సహాయపడింది. మరియు నెట్వర్క్ను ఉపయోగించుకోవడం ద్వారా, కుటుంబ వ్యాపార కార్యాలయాలు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలను మరియు మంచి వ్యాపారవేత్తలను గుర్తించి, పెట్టుబడి పెట్టగలవు, కుటుంబ యాజమాన్య వ్యాపారాల వృద్ధి మరియు విజయానికి విలువైన మద్దతును అందిస్తాయి.
ప్ర.6 దాతృత్వ కార్యక్రమాలలో ఫామిలీ ఆఫీసు ఏవిధంగా తోడ్పడుతుంది?
ఈ ఆఫీసు నిపుణులు తమ నీపుణ్యాలని, మార్గదర్శికత్వాన్ని వినియోగించి దాతృత్వ వ్యూహం ప్రణాళికని, కుటుంబ ఆకాంక్షలకి, అనుగుణంగా దాన ప్రయొజనాలని గుర్తిస్తుంది. కుటుంబ ఫౌండేషన్ను స్థాపించి, దాతల సలహాలని తీసుకొని కార్య్కర్మాలు నిర్వహిస్తుంది.
రాఫెల్లెర్ కుటుంబం ఈ కుటుంబం 1940 లో 'సోదరుల నిధి ' స్థాపించి లాభాపేక్షలేని సంస్థలని ప్రోత్సహిస్తోంది. ఈ నిధి ప్రభావవంతమైన పెట్టుబడులు పెడుతూ, ఆర్ధికాభివృద్ధి, లాభాలు, వాతావరణ అనుకూల ఫలితాలనిచ్చే పనులు చేస్తోంది. ఇది ప్రపంచమంతట పెట్టుబడులు పెడుతూ ప్రభావవంతమైన విలువల తో అనుసంధించబడి పనిచేస్తోంది. ఒక ఉదాహరణ ఎంటంటే బియాండ్ మీట్ లో పెట్టుబడి పెట్టింది.ఇది ఒక మొక్కల ఆధారిత మాంసం కంపెనీ, ఇది స్థిరత్వం మరియు పర్యావరణ సారథ్యం పట్ల కుటుంబం యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది
సశేషం పార్ట్ B లొ
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.