MARCH, 2023 < Back
ఈ వ్యాసము డెనిస్ టి జెఫ్ఫె గారు రాసినది. ఇందులో కుటుంబ విలువలు కుటుంబ యజమాన్య వ్యాపారాల విజయానికి, ఆయువుకి ఎల్లా దోహదం చేస్తాయి అనేది వివరింపబడింది. జఫ్ఫే గారు కుటుంబ విలవలు వ్యక్తికరించే విధానంలో కంపెనీ పరమార్ధము, గమ్యము ( mission and vision) సమ్మిళితం ప్రాధాన్యాన్ని వక్కాణించారు.
ఈ విలువలు కుటుంబం ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల సేవలు, ఉద్యోగుల యెడ గౌరవము, లాభాలని సంఘానికి/ ప్రజలకి ప్రధాన్యత ఇవ్వటమేకాక సమాజానికి తిరిగి ఇవ్వ్వటము, అనే అంశాల మీద దృష్టి పెడుతుంది.
ఒక ప్రసిద్ధ ఉదాహరణ మాసచుట్స్ కంపెనీ మాల్డెన్ మిల్ల్స్. ఈ కంపెనీ యజమాని మిల్లు మంటల్లో దగ్ధమైన తర్వాత కూడా ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం కొనసాగించాడు. ఈ కంపెనీ సేవల నాణ్యత కోసం పెట్టుబడికి, (ఉద్యోగుల) స్వామిభక్తికి ప్రశసించబడింది.
కుటుంబవ్యాపారాల్లో అనేక విధాలుగా కుటుంబ విలువలు వ్యక్తీకరింపబడుతాయి.
ఎప్పుడైతే విలువలు స్పష్టంగా ప్రకటింపబడి, కంపెనీ లక్ష్యాలతో సమ్యోగింపబడుతాయో అప్పుడు కుటుంబములో ఐకమత్య సంస్కృతి సృష్టింపబడుతుంది.దానివల్ల నమ్మకము, విశ్వతనీయత నిబద్ధత, కుటుంబ సభ్యుల్లోను, ఉద్యొగుల్లోను పెంపొందుతుంది. దానివల్ల ఉత్పాదకత, నూతనావిష్కరణలు, వినియోగదారుల సంతృప్తి వృద్ధి చెందుతుంది.
జఫ్ఫే గారు కుటుంబ విలువలలోని వైరుధ్యం – సామాజిక సంసర్గవల్ల ఉత్పన్నమయ్యేవాటిని గు రించి హెచ్చరించారు.
కొంతమంది కుటుంబ యజమానులు తమ విలువలు సమాజములో ఇతరుర్ల కంటే బిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. అటువంటి సందర్భాలలో ఆ కుటుంబాన్ని వాళ్ళతో ఏకీభవించే వారు ప్రశంసించవచ్చు. కొంతమంది, వాళ్ళని ఆదర్శంగా భావించవచ్చు- ఎందుకంటే ఆ కుటుంబం తాము నమ్మినదానికి నిలబడినందుకు. అయితే కుటుంబం తమ కంపెనీని పౌరసత్వము, సంఘమర్యాద విషయాల్లో వివాదాల్లో ఇరుక్కోవచ్చు. ఒక విషయంపై కట్టుబడి నిలబడడంవల్ల సంఘంతో కొంతమందితో విరోధం తెచ్చుకొని భావి తరాల వారికి వ్యాపారాంలో హాని కలిగించవచ్చు.
కుటుంబ వ్యాపార యజమానులు కుటుంబ పద్ధతులకి, వ్యాపార పద్ధతులకి మధ్య భేదం కల్పించాలి, లేకపోతే వ్యాపారం కుటుంబానికి ఒక పొడిగింపులాగ అవుతుంది. ఆందుకని వ్యాపార యజమమానులు కుటుంబం వ్యాపారంతో సంబధాన్ని విడతీస్తూ స్పష్టమైన పరిపాలనా విధానాన్ని నెలకొల్పాలి. ఇది ఒకోప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలకి విరుద్ధంగా ఉండ వచ్చు.
కుటుంబం వ్యక్తిగత నమ్మకాలని వ్యాపారం నించి విడదీయాలి. అయితే వ్యాపారం పట్ల విలువలు ప్రత్యక్షంగా వ్యక్తీకరించవచ్చు. ఈ విడదీయటం వ్యాపారానికి మంచిదే. కుటుంబం తమ సామాజిక, నైతిక విలువలని ఇతర రంగాల్లో వ్యక్తీకరించుకోవచ్చు.
సారాంశం ఏమంటే ఈ రచయిత విలువలని ప్రకటించేటప్పుడు కొన్ని మంచివి కొన్ని రిస్కులు ఉంటాయాని కుటుంబం గ్రహించాలి.
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.