JANUARY, 2023 < Back
ఏదైనా కుటుంబ వ్యాపారం కొనసాగింపు , పునరుద్ధరణ కోసం తదుపరి తరం సభ్యులను సమర్థ, సాధికారత కలిగిన "రేపటి నాయకులు"గా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు, సీనియర్ తరం కుటుంబ సభ్యులు తరచుగా వారు ఎదుర్కొనే సవాళ్లకు తమ పిల్లలను ఎలా సిద్ధం చేయవచ్చో అర్థం చేసుకోవాలనుకుంటారు.
మాట్ అలెన్ (బాబ్సన్ కాలేజీలో ఎంగేజ్డ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ సెంటర్ ఫర్ ఎంగేజ్డ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యుడు & ఫ్యాకల్టీ డైరెక్టర్), “తల్లిదండ్రులు కుటుంబ వ్యాపారంలో స్థితిస్థాపకతను ఎలా ప్రోత్సహించగలరు” (హార్వర్డ్ బిజినెస్ రివ్యూ, అక్టోబర్ 2022) అనే వ్యాసంలో వివరించారు. తల్లిదండ్రులు అనేక విధాలుగా తదుపరి తరంలో సమర్థత, స్థితిస్థాపకతను ప్రోత్సహించగలరు.
అంతర్గత నియంత్రణ అనేది వారి జీవితంలో ఏమి జరుగుతుందో దానిని తామే నియంత్రించగలరనే నమ్మకంగా నిర్వచించబడింది. కానీ అంతర్గత నియంత్రణ అనేది బాహ్య శక్తులచే నియంత్రించబడుతుందనే కొందరి నమ్మకానికి భిన్నమైన ఆలోచన. దీనిని తరువాతి తరంలో వేటి ద్వారా అభివృద్ధి చేయవచ్చు / బలోపేతం చేయవచ్చు ఈ క్రింద వివరించబడినది:
యువ కుటుంబ సభ్యులు వారు కుటుంబ వ్యాపారం కోసం పని చేసేటప్పుడు లేదా బయటి సంస్థలలో పనిచేసే మార్గాన్ని ఎంచుకున్నపుడు వారిపై వారు సందేహాన్ని కలిగి ఉండటం లేదా తమపై తమకు విశ్వాసం లేకుండా ఉండడం లాంటి స్థితులను అనుభవించే అవకాశం ఉంది. వారు
తమ పదవులను తమ విజయాల ద్వారా సంపాదించారా లేదా తమ కుటుంబ ప్రభావ ఫలితమా అని తరచుగా ఆలోచించే అవకాశం ఉంది.
అటువంటి సవాళ్లను అధిగమించడానికి తరువాతి తరం సభ్యులు తమ గుర్తింపు మూలధనాన్ని చురుకుగా నిర్మించుకునేలా చేసుకోవడం చాలా అవసరం (క్రిస్టిన్ కెఫెలర్, HBR). వారి వ్యక్తిగత గుర్తింపు మూలధనాన్ని నిర్మించడానికి ప్రభావవంతమైన మార్గాలు: తమ ఇంటి పేరు/ బ్రాండ్ పేరు తెలియని ప్రదేశంలో కళాశాలకు వెళ్లడం, తమ ఆసక్తులను ప్రతిభను నైపుణ్యాలు, సామర్థ్యాల అభివృద్ధి అంచనాల పోటీలలో పాల్గొనడం మొదలైనవి చేయడం ద్వారా స్వేచ్ఛగా అన్వేషించవచ్చు;
సంపన్న వ్యవస్థాపక కుటుంబంలో పెరిగిన తరువాతి తరం సభ్యులకు విజయానికి బెంచ్‌మార్క్ చాలా ఎక్కువగాను, సాధించలేనిదిగా అనిపించవచ్చు. వ్యాపార విజయ వారసత్వం లెక్కలోనికి తీసుకొనబడదు అనే భయం పెరుగుతున్న తరువాతి తరం సభ్యునికి మోయడానికి అది భారీ భారం కావచ్చు.
దానిని ఎదుర్కోవటానికి గ్రోత్ మైండ్ సెట్, మానసిక దృఢత్వం గణనీయంగా సహాయపడతాయి. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేయడం, మంచి వ్యూహాలు రచించడం, ఇతరుల నుండి ఆలోచనాత్మకమైన అభిప్రాయాన్ని పొందడం ద్వారా తమ సమర్థత/సామర్థ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు/మెరుగుపరచవచ్చు అని నమ్ముతారు. అలాంటి వ్యక్తులు అభ్యాస ప్రక్రియలో భాగంగా కష్టాన్ని/వైఫల్యాన్ని గ్రహిస్తారు. కానీ అది వారి బలహీనతకు సంకేతం కాదు. మార్గంలో అడ్డంకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించడంలో అభిరుచి/పట్టుదలని గ్రిట్ (మానసిక దృఢత్వం) అంటారు. గ్రోత్-మైండెడ్ వ్యక్తులు కొత్త నైపుణ్యాలను నేర్చుకునేటప్పుడు గ్రిట్‌ను ప్రదర్శిస్తారు. ఆ విధంగా గ్రిట్ ఉన్న వ్యక్తులు గ్రోత్ మైండ్ సెట్‌ను అవలంబించడం ద్వారా కష్టమైన, దీర్ఘకాలిక లక్ష్యాలను అనుసరించడంలో ప్రేరణ పొందగలుగుతారు.
గ్రిట్, గ్రోత్ మైండ్ సెట్‌ని పెంపొందించే కొన్ని మార్గాలు - తరచుగా అర్థవంతమైన అభిప్రాయాన్ని అడగడం; మీరు తెలుసుకోవలసిన అభ్యాసాలు లేదా నియమాలను నేర్చుకునేటప్పుడు కష్టపడటానికి ఇష్టపడటం/ఒక కొత్త పాత్రను విస్తరించడం; నిజమైన నిర్మాణాత్మక అభిప్రాయాన్ని గుర్తించడం అనేది ఎవరైనా మిమ్మల్ని విశ్వసిస్తున్నారనే సంకేతం (మీరు తగినంతగా సిద్ధమైన లేరు అనే సంకేతం కాదు); నైపుణ్యం, సాఫల్యం ల నిజమైన భావాన్ని పెంపొందించడానికి చాలా కాలం పాటు కొత్త సవాలుతో కట్టుబడి ఉండాలనే ధైర్యం కలిగి ఉండడం కూడా ఉపయోగపడుతుంది.
అభివృద్ధి చెందుతున్న వారసత్వంలో భాగంగా ఉండటం ద్వారా కొందరు తరువాతి తరం సభ్యులు అనుకోకుండా “నేర్చుకున్న నిస్సహాయత" భావాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది వారి స్వంత ప్రయత్నాలు పరిస్థితులను గణనీయంగా మార్చవని గ్రహించిన స్థితి కాబట్టి వారు ప్రయత్నాలు చేయడం మానేస్తారు. ఆర్థిక అవసరం లేకపోవడం కూడా వారు పని చేయకుండా ఉండడానికి ప్రేరేపించి తద్వారా వారి కుటుంబ వ్యాపారంలో మార్పు తీసుకురావడానికి, వారిలో ప్రేరణ గణనీయంగా తగ్గడానికి, వారిని నిష్క్రియ యజమానులుగా పట్టాలు తప్పడానికి దారి తీస్తుంది.
"కొత్తగా అలవరచుకున్న నిస్సహాయత" ప్రమాదంలో ఉన్న తరువాతి తరం కోసం అభివృద్ధి ప్రణాళికలో ఉద్దేశపూర్వకంగా విభిన్న నైపుణ్య అనుభవాలను పెంపొందించడానికి అవకాశాలు లేదా ప్రాజెక్ట్‌లను కలిగి ఉండాలి - ఇలాంటి సందర్భాలు / అసైన్మెంట్లు తరువాతి తరం వారిని "కావాల్సినంత కష్టం" తో సవాలు చేస్తాయి.
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.