SEPTEMBER, 2022 < Back
సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనడం అనేది నాయకులు, వ్యవస్థాపక కుటుంబాల సభ్యుల వ్యక్తిగత బ్రాండ్ ను రూపొందించుకొనడానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. చాలా మంది వ్యవస్థాపకులు, స్టార్ట్-అప్ వ్యవస్థాపకులు, సి-సూట్ నాయకులు శక్తివంతమైన వ్యక్తిగత బ్రాండ్‌ను రూపొందించడానికి విజయవంతమైన సోషల్ మీడియా వ్యూహాలను అనుసరించారు. ఆ వ్యక్తి ఏ సంస్థతో అనుబంధం కలిగి ఉంటాడో ఆ బ్రాండ్ గుర్తింపును మెరుగుపరచడానికి ఇది సమర్థవంతమైన వ్యూహం.
కుటుంబ యాజమాన్యం లోని వ్యాపారం విషయంలో వ్యవస్థాపకుడు లేదా కుటుంబ సభ్యులు లేదా సంస్థ వ్యక్తిగత బ్రాండ్ల మధ్య పరస్పర లింక్‌ల వలన ఆన్లైన్ కీర్తి సామాన్యంగా కొంత ఎక్కువ క్లిష్టంగా ఉంటుంది. అందువల్ల, వ్యక్తిగత లేదా సంస్థ బ్రాండ్ గుర్తింపును బలోపేతం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని వ్యక్తి / కుటుంబం గట్టిగా విశ్వసిస్తే ఆ వ్యక్తిగత కీర్తి నిర్వహణ కోసం బాగా ఆలోచించిన సోషల్ మీడియా వ్యూహాన్ని అనుసరించి కోర్/ వారసత్వ వ్యాపారం ల బ్రాండ్ గుర్తింపును మెరుగుపరచడానికి దానిని అర్థవంతంగా ఉపయోగించడం ముఖ్యం.
వాటాదారుల ఒప్పందాలు యాజమాన్యం ఫ్రేమ్‌వర్క్, నియమాల గురించి స్పష్టతను అందిస్తాయి. ఇవి కుటుంబ వ్యాపారానికి యజమానిగా ఉండటానికి యాజమాన్య విలువ, యాజమాన్య బదిలీ లేదా విక్రయ ఎంపికలు, ఓటింగ్ హక్కులు,బోర్డు సభ్యుల ఎంపిక వంటి వివిధ అంశాలను నిర్వచించే చట్టపరమైన పత్రాలు. ఇవి వాటాదారులు తమ యాజమాన్య ఆసక్తులను ఎలా నిర్వహించాలో చట్టపరమైన ఆధారాన్ని ఏర్పరుస్తాయి. ఆ ప్రయోజనం గుర్తించే పనిపై ఏర్పాటు చేయబడిన వాటాదారుల సమూహాలు సమయం, శక్తి ల సరైన పెట్టుబడితో ఈ ఒప్పందాలను రూపొందించడం చాలా సులభం.ఒకే యజమాని ప్రారంభించిన వ్యాపారాలకు వాటాదారుల ఒప్పందం అంత అవసరం లేదు. యాజమాన్యం తరువాతి తరానికి (సాధారణంగా తోబుట్టువుల దశలో) బదిలీ చేయబడుతున్నప్పుడు, ఒప్పందం నిబంధనలను అంగీకరించడానికి వాటాదారుల సమూహం చాలా పెద్దదిగా మారడానికి ముందు సాధారణంగా వాటాదారుల ఒప్పందాలు సృష్టించబడతాయి.
సోషల్ మీడియా ప్రయోజనాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కుటుంబాలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ కీర్తికి వచ్చే విపత్తులను పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర ఆస్తులను ఎలా రక్షించుకుంటామో అలా కుటుంబ ప్రతిష్టను కాపాడుకోవడం/రక్షించడం కూడా అంత అవసరం. ప్రస్తుత కాలంలో సమాచారం ప్రయాణించే వేగం, పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేయబడిన ప్రతికూల సమాచారం ఎప్పటికీ అందుబాటులో ఉండే వాస్తవం కారణంగా ప్రస్తుత కాలంలో ఇది చాలా సవాలుగా ఉంది. అంతేకాకుండా, సోషల్ మీడియా సైట్ల ద్వారా వ్యక్తిగత సమాచారం పూర్తిగా అందుతుంది కాబట్టి వ్యాపార కుటుంబాలు తరచుగా సైబర్ క్రైమ్ లాంటి ఇతర ప్రమాదాలకు గురి అవుతున్నాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి.
మామూలుగా "జాగ్రత్తగా ఉండండి" అని కుటుంబ సభ్యులను అడగడం వల్ల ఫలితం ఉండదు. సోషల్ మీడియాలో క్రమశిక్షణ లేదా జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల వచ్చే చిక్కులు కుటుంబంగా అధికారిక సమావేశాలలో చర్చించబడాలి. కుటుంబ డిజిటల్,భౌతిక భద్రతను రక్షించే సోషల్ మీడియా విధానాన్ని రూపొందించడం అన్ని ఉన్నత స్థాయి సంపన్న కుటుంబాలకు అవసరం. ఉదాహరణకు ఒక కుటుంబంలో వారి “పేరు, ప్రతిష్ఠల నిర్వహణ విధానం” ప్రతి కుటుంబ సమావేశంలో సోషల్ మీడియా వినియోగం, కుటుంబ పేరు, ప్రతిష్ఠలకు వచ్చే ప్రమాదాన్ని చర్చించడానికి కట్టుబడి ఉంటుంది. సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంలో సహాయపడటానికి వారు బయట నుండి ఫెసిలిటేటర్‌ను ఉపయోగించడంతో పాటు హ్యాకర్ల నుండి రక్షింపబడడానికి సైబర్ సెక్యూరిటీ ఆడిట్‌ను కూడా ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో వారి “పేరు, ప్రతిష్ఠల నిర్వహణ విధానం” ప్రతి కుటుంబ సమావేశంలో సోషల్ మీడియా వినియోగం, కుటుంబ పేరు, ప్రతిష్ఠలకు వచ్చే ప్రమాదాన్ని చర్చించడానికి కట్టుబడి ఉంటుంది. సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంలో సహాయపడటానికి వారు బయట నుండి ఫెసిలిటేటర్‌ను ఉపయోగించడంతో పాటు హ్యాకర్ల నుండి రక్షింపబడడానికి సైబర్ సెక్యూరిటీ ఆడిట్‌ను కూడా ఏర్పరచుకుంటారు.
ఒక వ్యక్తిగా లేదా ఒక కుటుంబంగా ఏ సమాచారాన్ని బహిర్గతం చేయాలి ఏది బహిర్గతం చేయకూడదు అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. వారు గోప్యంగా ఉంచాలనుకునే ఏ విషయమైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయకూడదు.
పాలసీ - ముసాయిదా తయారు చేసుకునే ప్రక్రియలో సామూహిక చర్చ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అవసరాలు, లక్ష్యాల చిక్కులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అటువంటి చర్చ అవగాహనను పెంచడంతో పాటు కుటుంబ ముఖ్య నిబద్ధతను భద్రపరుస్తుంది.
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.