SEPTEMBER, 2021 < Back
వంశ వృక్షం- కుటుంబంలో సంబంధాల అవగాహనకి సాధనం.
కుటుంబంలో సాన్నిహిత్యం అనేది ఒక మూలధనం లాంటిది. ఇది కుటుంబవ్యాపారానికి పోటి రంగంలో పురోగామిగా చెయ్యటానికి తోడ్పడుతుంది.
ఒక కుటుంబం సమర్ధవంతంగా అందరూ బృందస్పూర్తితో పనిచేయటానికి ఈ క్రింది సూచనలు పాటించాలి-
> మన కుటుంబ సంబంధాలు ఇంకా బలపడటానికి, సమస్యలు పరిష్కరించుకోవటానికి ఎల్లా ఉపయోగడతాయి అని ఆలోచించుకోవాలి.
> అవి మన వ్యాపారం, యజమానులుగాను, మేనేజెర్లుగాను సమర్ధవంతంగా నిర్వహించాలంటే ఏమిచేయాలి.
> తరాలవారీగా పరిశీలిస్తే సభ్యుల భిన్న ప్రవర్తనా పోకడలు మన కుటుంబం ఒక సామాజికి వ్యక్తిత్వం కలిగి ఉండేలాగ ఉండాలి.
> మన కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉన్నాయా. అలాయితే కుటుంబవ్యాపారంలో చర్చల పై ఏలాంటి ప్రభావం చూపిస్తున్నాయి.
డా. ముర్రే బ్రేన్ ప్రతిపాదించిన సిద్ధాంత విధానం ప్రకారం కుటుంబసభ్యుల సంబంధాలు చాలా గాఢమైన భావోద్వేగాలతో పెనవేసుకుని ఉంటాయి.
ఒకోసారి కుటుంబంలో వ్యక్తులు దూరంగా, సంబంధాలు తెగిపోయినట్లుగా భావించవచ్చు. కాని అది ఒక భావన మాత్రమే. నిజం కాదు. వాళ్ళు ఇతర సభ్యుల ఆలోచనలు, ఆచరణలు ఎంత గాఢంగా ఉంటాయంటే ఒకే కప్పుకింద ఉంటూ (భావసాన్నిహిత్యంతో) ఉన్నట్లే భావిస్తూ ఉంటారు.వాళ్ళు దూరంగా ఉన్న సభ్యులపట్ల శ్రద్ధ, అనుగుణ్యత, సహాయం ఆకాంక్షిస్తూ అభిప్రాయాలకి ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏర్పడిన భావాలు, ప్రతిస్పందనలు, బంధాలు పరస్పరాధారతకి మూలకారణాలు అవతాయి. ఒకసభ్యుని ప్రవర్తన మిగతా సభ్యుల ప్రవర్తనపై ఊహించ విధమైన ప్రభావం కలిగి ఉంటుంది.
వ్యాపార కుటుంబాల భావోద్వేగ స్వభావ ప్రకృతి ఏవిధంగా తమ వ్యక్తిత్వాన్ని, కార్యాకలాపాలని, సామాజిక కుటుంబంగా ఎల్లా ప్రభావితం చేసాయో తెలుకోవటం చాలా ప్రయొజనకారిగా ఉంటుంది అని
డా. రేండాల్ కేర్లాక్ అనే కుటుంబ వ్యాపార ఆచార్యుడు, రచయత, పరిశోధనాకర్త అభిప్రాయo. ఇటువంటి ప్రవర్తనా పోకడలు అవగాహనా సమాచారం సమీకరించుకొనే సాధనం చాల ఉపయోగకరం.
అటువంటి సాధనమే వంశవృక్ష రచన. దీన్ని కుటుంబసభ్యులంతా కూర్చుని సమిష్టిగా ఏకాభిప్రాయంతో రచించుకోవాలి.
తాము ఏవిధంగా సమిష్టి ధ్యేయం పట్ల సన్నద్ధులు కావాలి అనేది ఆలోచించుకోవచ్చు. మూలపురుషుని మొదలుగా ప్రతి ఒక్కరి అనుభవాలు ఈ వంశవృక్ష తయారీలో ప్రభావితం చేస్తాయి. అందుకని ప్రతిఒక్కరు తమ జీవిత సన్నివేశాలను విశదీకరించుకోవటం ద్వారా ఒక రూపం వస్తుంది.
వంశవృక్షంలో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరికి గల సంబంధాలు ఎల్లావున్నాయి అనేది చిత్రీకరించబడుతుంది. ఆ సంబధాలు ఎటువంటి స్థాయిలో ఉన్నాయి అనేది ఈ క్రింది మూడు విధాలుగా ఉంటుంది.
> కుటుంబ సంఘటనలు- జననాలు, మరణాలు, విద్యార్హతలు, పెళ్ళిళ్ళు - రికార్ద్ చేయబడుతాయి.
> కుటుంబ సభ్యుల అధికార పదవులు
> కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు- సన్నిహితులా, దూరస్తులా, సంఘర్షితులా అనే పరిస్తితులు.
కుటుంబం వ్యాపారంలో ఉన్నతి, కీలక సంఘటనలు ఇవన్నీ కాలక్రమంలో రాసుకోవాలి. వీటి గురించిన కధలు పంచుకోవాలి.నిర్ణయాలు ఎల్లా తీసుకుంటారో, కీలక సంఘటనల్లో అందరూ ఎల్లాగ కలిసికట్టుగా పనిచేస్తారో అర్ధమవుతుంది.
ఈ వంశవృక్షాన్ని కుటుంబసభ్యులంతా పరస్పర సహకారంతో ఏకాభిప్రాయంతో రాసుకోవటంవల్ల చేకూరే అవగాహన వ్యాపార విజయానికి ఉపయోగపడుతుంది.
కొన్ని ప్రశ్నలు--
" కుటుంబంలో వ్యక్తులు ప్రతీ తరంలోనూ ఎవరెవరు ఒకే రకంగా ఉన్నారు"
"ఎవరి పేరు ఎక్కువగా తరచూ చెప్పుకుంటూ ఉంటారు"
"ఏదైనా సంఘటన జరిగితే దాని చుట్టూ ఉన్న ఆర్ధిక, సామాజిక ప్రభావాలు ఏమిటి"
" చిన్నవాళ్ళు తమ తాత ముత్తాతల గురించి ఏమి తెలుసుకోవాలి "
ఈవిధంగా మూలాలు తెలుసుకుంటే సమకాలికంగా ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది అవగాహన అవుతుంది. అందరూ కలిసి చేసుకునే చర్చల ద్వారా యుక్త సంభాషణా విధానం ఇతర బలాలను సాధించవచ్చు.
> కుటుంబ సభ్యులు సంబంధాలలొ కలిగే ఆందోళనలు సకాలంలో పసిగట్టీ రాబొయే దుష్పలితాలను నివారించుకోవచ్చు. మూసపోసిన ప్రవర్థనలు, సంభాషణా పద్ధతులు, హానికరమైన పోకడలు నివారించుకోవచ్చు/ పరిష్కరించుకోవచ్చు.
> వారసత్వ ప్రణాళిక రచించుకోవటం, భవిష్యత్తు పరిణామాలు ముందుచూపుతో ఉహించుకోగలగవచ్చు.
> కుటుంబ శాఖల మధ్య ఎవైనా అంతర్గత సంబధాలు అందోళన కరరంగా ఉంటే వాటిని బహిర్గతం చేసుకుని పరిష్కరించుకొని, ముందు జాగర్తలు తీసుకోవచ్చు.
“A tool to spark a meaningful family dialogue”, Randel S. Carlock, Family Business Magazine “Working with family diagrams in family business reflections from 20 years of practice, Guillermo Salazar, FFI Practitioner Research in Bowen Theory, The Bowen Center for the Study of the Family.
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.